బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇంటర్ పోల్ ‘బ్లూ కార్నర్ నోటీసు’ జారీచేసింది.ఒక ఎంపీగా ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్టును ఉపయోగించి జర్మనీకి వెళ్ళారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. జర్మనీకి వెళ్ళేందుకు ఎంపీలకు దౌత్యపరమైన అనుమతి అవసరం లేదని, తాము వీసా జారీ చేయలేదని స్పష్టం చేశారు.
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఉంటుంది. పార్లమెంటు సభ్యులకు, ఉన్నత స్థానాలలోని ప్రభుత్వాధికారులకు, దౌత్యవేత్తలకు, రాయబార కార్యాలయ అధికారులకు ఈ పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు.
ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఈ తరహా పాస్‌పోర్టు ఉన్నందువల్లే, జర్మనీకి వెళ్ళేందుకు ఆయనకు మరో వీసా అవసరం లేకుండా పోయిందని రణ్‌ధీర్ చెప్పారు.
Write your comment
All fields are mandatory.















